కోరిన వంటకం చేయలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన భ‌ర్త‌..

Husband attacked his wife with axe for not preparing favorite food. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కోరిక మేరకు ఆహారం

By Medi Samrat  Published on  10 May 2022 5:18 PM IST
కోరిన వంటకం చేయలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన భ‌ర్త‌..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కోరిక మేరకు ఆహారం వండలేదన్న కోపంతో భర్త భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. రక్తంలో తడిసిన భార్యను వదిలి నిందితుడైన భర్త అక్కడి నుండి పరారయ్యాడు. అతడిని మోహన్‌లాల్‌గంజ్ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఆసుపత్రిలో చేరిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇన్‌స్పెక్టర్ అఖిలేష్ మిశ్రా మాట్లాడుతూ.. గణేష్‌ఖేడాకు చెందిన సుభాష్ చంద్ర గౌతమ్‌ను బస్ స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు.

నిందితుడు సుభాష్ సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో అతని భార్య లక్ష్మీదేవి.. అతడు కోరిన ఆహారాన్ని తయారు చేయలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భార్య సమాధానంతో కోపోద్రిక్తుడైన సుభాష్ ఆమెను గొడ్డలితో దాడి చేశాడు. బాధితురాలి శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ఆమె రక్తపు మడుగులో పడి సహాయం కోసం కేకలు వేసింది. ఆ సమయంలో ఇరుగుపొరుగువారు వచ్చారు. వారికి భయపడి సుభాష్ ఇల్లు వదిలి పారిపోయాడు. లక్ష్మిని చికిత్స నిమిత్తం సిహెచ్‌సిలో చేర్చారు. హత్యాయత్నం సెక్షన్ల కింద సుభాష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.












Next Story