వేడి నీళ్ల కారణంగా భార్యా భర్తల మధ్య గొడవ.. ఆ తర్వాత..

Husband and wife quarrel over hot water. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో వేడి నీటి కారణంగా భార్యాభర్తలు గొడవపడ్డారు.

By Medi Samrat  Published on  19 Dec 2021 1:37 PM GMT
వేడి నీళ్ల కారణంగా భార్యా భర్తల మధ్య గొడవ.. ఆ తర్వాత..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో వేడి నీటి కారణంగా భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భర్త భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇదేదో ఇప్పటి కాలంలో జరిగిన పెళ్లి అని అనుకున్నారేమో.. కాదు..! విడిపోయిన జంటకి పెళ్లయి 16 సంవత్సరాలు అయింది. ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే అతడు ట్రిపుల్ తలాక్‌ చెప్పినట్లు తెలుస్తోంది. తలాక్ పై చట్టం తీసుకుని వచ్చినా ఈ ఘటనలు దేశంలో ఆగడం లేదు.

బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్రుద్దీన్‌పూర్ గ్రామానికి చెందినది. ఒక వ్యక్తి తన భార్యకు 16 సంవత్సరాల తర్వాత చిన్న విషయంపై విడాకులు ఇచ్చాడు. బాధితురాలు తన సోదరుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తలాక్ చెప్పి తన భర్త విడిపోయాడని ఆరోపించింది. సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిఖా జరిగినప్పటి నుండి అత్తమామలు తనను వేధించేవారని భార్య ఆరోపించింది. ఆమెకు 5 మంది పిల్లలు, చిన్న బిడ్డకు రెండేళ్లు వయసు మాత్రమే. గురువారం భర్తకు వేడినీళ్లు ఇవ్వగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాధితురాలు తెలిపింది. అప్పుడు కోపంతో తనకు 3 సార్లు తలాక్ చెప్పి ఇంటి నుంచి వెళ్లగొట్టారని వాపోయింది. అలాగే పిల్లలందరినీ చితక్కొట్టాడని తెలిపింది. విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తనకు చిన్న పిల్లలు ఉన్నారని, వారిని పెంచడానికి ఎలాంటి ఆసరా లేదని బాధితురాలు చెప్పింది.


Next Story
Share it