భారీ అగ్నిప్రమాదం.. 500 షాపులు అగ్నికి ఆహుతి

Huge Fire Accident In Pune. మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. పుణెలోని ఎంజీ రోడ్‌లో

By Medi Samrat  Published on  27 March 2021 9:01 AM IST
భారీ అగ్నిప్రమాదం.. 500 షాపులు అగ్నికి ఆహుతి

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. పుణెలోని ఎంజీ రోడ్‌లో ఫ్యాషన్‌ స్ట్రీట్‌ మార్కెట్‌లో శుక్ర‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా మంటలు చెల‌రేగాయి. దీంతో మార్కెట్ లో చాలా షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. త‌క్కువ స‌మ‌యంలోనే మంటలు పక్కనే ఉన్న షాపులకు కూడా వ్యాపించడంతో సుమారు 500 దుకాణాలు కాలిబూడిద‌య్యాయి. ఇదిలావుంటే.. ఫ్యాషన్‌ స్ట్రీట్‌లో‌ ఉన్న చిన్నచిన్న దుకాణాల్లో బట్టలు, షూస్‌, గాగుల్స్‌, ఇతర యాక్సెసరీల అమ్మకాలు జరుగుతాయి. ఈ ఘ‌ట‌న‌తో చిరు వ్యాపారుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది.

ప్ర‌మాదంపై చీఫ్‌ ఫైర్‌ఫైంటింగ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ రాన్‌పైస్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం రాత్రి 9.30 గంటల సమయంలో అందిందని.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని‌ వెల్లడించారు. తక్కువ సమయంలోనే పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 16 ఫైర్‌ఇంజన్లతో రాత్రి 1 గంటల వరకు శ్ర‌మించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇదిలావుంటే.. గడిచిన‌ 15 రోజుల్లో పుణెలో ఇది రెండో అగ్నిప్రమాదం. అంత‌కుముందు మార్చి 16న పట్టణంలోని శివాజీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్ర‌మాదంలో సుమారు 25 దుకాణాలు అగ్ని ఆహుత‌య్యాయి. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మంట‌లు వ్యాపించ‌డానికి గ‌ల కారణాల‌ను అన్వేషిస్తున్నారు.


Next Story