రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్‌ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు.

By Medi Samrat
Published on : 14 Aug 2025 8:26 PM IST

రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్‌ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు. సూర్జీత్ అనే వ్యక్తి ఆ టీనేజర్‌ను హత్య చేసి, ఆత్మహత్యగా చూపించడానికి ప్రయత్నించాడు. ఆమె మృతదేహాన్ని ఉరికి వేలాడదీశాడు. రక్షా బంధన్ సందర్భంగా, సుర్జీత్ ఉదయం తన మామ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె చేత రాఖీ కట్టించుకున్నాడు. అదే రాత్రి, అతను మద్యం సేవించి నిద్రపోతున్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆమె ప్రాణాలను తీసి, ఆపై ఆమెను ఉరికి వేలాడదీశాడు.

పక్క గదిలో నిద్రిస్తున్న బాధితురాలి తండ్రి మరుసటి రోజు తన కుమార్తె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకోగానే, సుర్జీత్ ఇంటికి చేరుకుని దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో కుటుంబం తరపున అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, కుటుంబ సభ్యులను మాట్లాడనివ్వకపోవడంతో అతడిపై అనుమానం పెరిగింది. ఇక పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. అనుమానం కారణంగా సుర్జీత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతను నేరాన్ని అంగీకరించాడు.

Next Story