పబ్‌కు వెళ్లిన యువతికి పోకిరీల వేధింపులు.. అసభ్యకరమైన సైగలు.. ఆపై బెదిరింపులు

Hooligan harassment of a young woman who went to a pub in Hyderabad. హైదరాబాద్‌ నగరంలో పబ్‌కు వెళ్లిన యువతిని ఆకతాయిలు వేధింపులకు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది. అసభ్యకరమైన సైగలు చేస్తూ

By అంజి  Published on  23 Dec 2021 8:13 AM IST
పబ్‌కు వెళ్లిన యువతికి పోకిరీల వేధింపులు.. అసభ్యకరమైన సైగలు.. ఆపై బెదిరింపులు

హైదరాబాద్‌ నగరంలో పబ్‌కు వెళ్లిన యువతిని ఆకతాయిలు వేధింపులకు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది. అసభ్యకరమైన సైగలు చేస్తూ యువతిని ఆటపట్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఓ 28 ఏళ్ల యువతి జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని రోగ్‌పబ్‌కు తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లింది. అయితే అదే పబ్‌కు వాహిద్‌ అనే యువకుడితో పాటు అతని స్నేహితులు వచ్చారు. ఈ క్రమంలోనే వారి కన్ను.. యువతిపై పడింది. ఆమెను అనుకరించడం ప్రారంభించారు. పబ్‌ నుంచి కింద పార్కింగ్‌కు వచ్చిన యువతి కారు కోసం ఎదురు చూస్తోంది.

ఇది గమనించిన వాహిద్‌, అతని స్నేహితులు.. యువతికి అసభ్యకరంగా సైగలు చేయడం ప్రారంభించారు. కారులు మార్చుకుందామని.. యువతితో మాటలు కలిపేందుకు ప్రయత్నించారు. ఆపై యువతిని బెదిరింపులకు గురి చేశారు. కారు ఎక్కే క్రమంలో యువతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడితో ఆగని ఆకతాయిలు.. యువతి వెళ్తున్న కారును వెంబడించారు. దీంతో యువతి నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు టోలిచౌక్‌కు చెందిన వాహిద్‌, అతని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. వారికి నోటీసు అందించడంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story