పెద్దఎత్తున హెరాయిన్ ప‌ట్టివేత‌.. విలువ‌ రూ. 70 కోట్ల‌పైనే..

Heroin worth 70 crore seized at Chennai airport. చెన్నై ఎయిర్‌పోర్ట్ లో పెద్దఎత్తున‌ మాదకద్రవ్యాలు (హెరాయిన్) పట్టుబ‌డ్డాయి.

By Medi Samrat  Published on  6 Jun 2021 3:38 AM GMT
పెద్దఎత్తున హెరాయిన్ ప‌ట్టివేత‌.. విలువ‌ రూ. 70 కోట్ల‌పైనే..
చెన్నై ఎయిర్‌పోర్ట్ లో పెద్దఎత్తున‌ మాదకద్రవ్యాలు (హెరాయిన్) పట్టుబ‌డ్డాయి. ద‌క్షిణాఫ్రికా జోహాన్నెస్ బర్గ్ నుండి చెన్నై వచ్చిన ఆఫ్రికన్ మ‌హిళ‌ల నుండి రూ. 70 కోట్ల విలువ చేసే 10 కేజీల మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింది‌ బాగంలో దాచి.. గుర్తు పట్టకుండా ఘాటైన స్ప్రే కొట్టారు. ఆనారోగ్యం నెపంతో వీల్ చెయిర్ లో కూర్చొని బయటకు చెక్కేసే ప్రయత్నం చేశారు.


కిలాడి లేడీల వ్యవహారంపై అనుమానం వచ్చి అడ్డగించిన కస్టమ్స్ అధికారులు.. వీల్ చెయిర్ పై ఎందుకు వెళుతున్నారు అంటూ ప్రశ్నించారు. నీరసంగా వుంది అందుకే వీల్ చెయిర్ తీసుకున్నామంటూ.. మరో లేడి ప్రయాణికురాలు జవాబిచ్చింది. ఇద్దరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారుల బృందం.. వారిని తమదైన స్టైల్ లో ప్రశ్నించగా.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా గుట్టు విప్పారు. దీంతో అధికారులు ట్రాలీ బ్యాగ్ కింది బాగంలో వున్న మాదకద్రవ్యాలు స్వాధీనం చేశారు.

అధికారులు ఇద్దరు లేడి కిలాడీలపై ఎన్‌డిపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు ఎవరి కోసం తీసుకొచ్చారనే సమాచారాన్ని కూపి లాగుతున్నారు కస్టమ్స్ అధికారులు. దీని వెనుక వున్న అస‌లు సూత్ర‌ధారులు ఎవ‌రనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఇక‌ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో కూడా భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఓ మహిళపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా.. 8 కిలోల‌ హెరాయిన్‌ లభ్యమైనట్లు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకోని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చిన మ‌హిళ వ‌ద్ద మాద‌క‌ద్ర‌వ్యాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో డీఆర్ఐ అధికారులు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా క‌రోల్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.





Next Story