ముంబై రోడ్లపై తుపాకీలతో రచ్చ రచ్చ

Heavy gunfire on the streets of Ambernath Mumbai. ముంబయిలో పట్టపగలు ఓ వర్గం కాల్పులకు దిగిన ఘటన ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది.

By Medi Samrat  Published on  14 Nov 2022 3:57 PM IST
ముంబై రోడ్లపై తుపాకీలతో రచ్చ రచ్చ

ముంబయిలో పట్టపగలు ఓ వర్గం కాల్పులకు దిగిన ఘటన ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఎద్దుల బళ్ల పోటీల నిర్వహణలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలిసింది. దీంతో మరో వర్గం వారిపై కాల్పులకు దిగింది. సుమారు 15-20 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముంబై అంబర్‌నాథ్‌లో ఆదివారం రాత్రి ఎద్దుల బండి పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. దాంతో ఒక వర్గం అకస్మాత్తుగా మరొకరిపై కాల్పులు జరిపింది. ఎద్దుల బండి రేసులో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో దాదాపు 15-20 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని అంటున్నారు.

రహదారికి దూరంగా పార్క్‌ చేసిన వాహనాల చుట్టూ కొంతమంది నిలబడి ఉండగా, కాల్పులు జరగడం, కొందరు కార్ల వెనుక దాక్కోవడానికి యత్నించారు. మరికొందరు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మొదట చాలా మంది అవేవో టపాసుల సౌండ్స్ అని అనుకున్నారు. తీరా చూస్తే బెదిరించడానికి గన్ తో ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది.


Next Story