కాలువలో తల లేని యువతి మృత‌దేహం.. స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు

Headless body of young woman found in drain in Uttar Pradesh. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా లఖీపురా ప్రాంతంలో శుక్రవారం తల లేని యువతి

By Medi Samrat  Published on  12 Aug 2022 4:39 PM IST
కాలువలో తల లేని యువతి మృత‌దేహం.. స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా లఖీపురా ప్రాంతంలో శుక్రవారం తల లేని యువతి మృతదేహం లభ్యమైంది. లఖీపురా ప్రాంతంలోని లేన్ నంబర్ 28 సమీపంలోని డ్రెయిన్‌లో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలికి ఇరవై ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య జ‌రిగ‌న ప్ర‌దేశం, వివ‌రాల‌ను దాచేందుకు నేర‌స్థులు తలలేని మృతదేహాన్ని కాలువలో వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి రప్పించామని పోలీసు ప్రతినిధి తెలిపారు.

స్థానికులను సంప్రదించి.. ఆ ప్రాంతంలో తప్పిపోయిన మహిళల వివరాలను సేకరించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సమీపంలోని పట్టణాల్లో తప్పిపోయిన మహిళల జాబితాను కూడా సేకరించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. హ‌త్య‌కు గురైన‌ మహిళ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత నెలలో కూడా మీరట్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌రిగింది. ఓ కాలువలో తల లేకుండా బాగా కుళ్ళిపోయిన మహిళ మృతదేహం ఇదే విధంగా బ‌య‌ట‌ప‌డింది. త‌ర‌చూ ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌టంతో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు.








Next Story