భార్యను చంపి.. డెడ్ బాడీ పక్కన కూర్చుని

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక గర్భిణీ స్త్రీని ఆమె భర్త కత్తితో పొడిచి చంపాడు.

By Medi Samrat
Published on : 2 Aug 2025 7:45 PM IST

భార్యను చంపి.. డెడ్ బాడీ పక్కన కూర్చుని

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక గర్భిణీ స్త్రీని ఆమె భర్త కత్తితో పొడిచి చంపాడు. రవిశంకర్ ఏడు నెలల గర్భవతి అయిన భార్య సప్నను గదిలో చంపి, తాళం వేశాడు. పోలీసులు వచ్చే వరకూ అక్కడే కూర్చుని ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సప్న గత ఐదు నెలలుగా అమ్హెరాలోని తన సోదరి పింకీ ఇంట్లో నివసిస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో వివాహం జరిగింది. అయితే తన భర్త రవితో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె అక్కడికి వెళ్లింది.

శనివారం ఉదయం, రవి అమ్హెరా నివాసానికి చేరుకుని సప్నతో మాట్లాడాలని కోరాడు. రవి సప్నను మొదటి అంతస్తులోని ఒక గదికి తీసుకెళ్లి తలుపు మూసేశాడు. కొన్ని క్షణాల తర్వాత, తాళం వేసి ఉన్న గది లోపల నుండి అరుపులు, కేకలు వినిపించాయి. కుటుంబ సభ్యులు, పొరుగువారు సప్నను కాపాడడం కోసం ప్రయత్నించాడు. ఆమె ఎంత వేడుకున్నా, రవి ఆమెపై పదేపదే కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను ఆమె గొంతు కోసి, ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెను అనేకసార్లు పొడిచాడు.

సప్న సోదరి, ఇతరులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే సమయానికి, తలుపు లోపలి నుండి లాక్ చేశారు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టే వరకు ఎవరూ లోపలికి పోలేకపోయారు. లోపల, గది అంతటా రక్తంతో నిండి ఉండగా రవిశంకర్ తన భార్య మృతదేహం పక్కన కూర్చుని ఉండటం చూశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. రవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సప్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం పంపారు.

Next Story