స్పా సెంటర్ యువతిపై దారుణానికి పాల్ప‌డ్డ‌ కానిస్టేబుల్.!

Haryana police constable raped a girl working in spa centre. మహిళల భద్రతను కాపాడాల్సిన పోలీసు కానిస్టేబుల్ యువతిపై అత్యాచారానికి

By Medi Samrat  Published on  27 Nov 2021 12:55 PM GMT
స్పా సెంటర్ యువతిపై దారుణానికి పాల్ప‌డ్డ‌ కానిస్టేబుల్.!

మహిళల భద్రతను కాపాడాల్సిన పోలీసు కానిస్టేబుల్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తున్నాయి. హర్యానా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సహా ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఆరోపిస్తోంది. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను మోడల్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయగా.. హెడ్ కానిస్టేబుల్‌ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సస్పెండ్ చేశారు. స్పా సెంటర్‌లో పనిచేస్తున్న యువతి తాను గదిలో ఉన్నప్పుడు తనపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత తనపై అత్యాచారం చేసి స్కార్పియో వాహనంలో హోటల్‌కు తీసుకెళ్లినట్లు చెప్పింది. ఈ ఘటనపై రేవూరి పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హెడ్ ​​కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్ర, ధర్మేంద్ర అనే వ్యక్తిపై సెక్షన్ 376, 366, 342, 354ఏ కింద కేసు నమోదు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉందని డీఎస్పీ మహ్మద్ జమాల్ తెలిపారు. ఏ హోటల్‌ను తీసుకెళ్లి అత్యాచారం చేశారు, ఘటనా స్థలంలో ఎవరెవరు ఉన్నారనేది విచారణలో త్వరలో తేలనుంది.


Next Story
Share it