కూతురిపై దారుణానికి ఒడిగట్టిన తండ్రి.. కోర్టు ఏ శిక్ష విధించిందంటే..!
Haryana Man Sentenced To 10 Years In Jail For Raping Daughter. అతడు మనిషి కాదు.. మృగం..! వావి వరసలు లేకుండా ప్రవర్తించాడు. కుమార్తె
By Medi Samrat Published on 12 Aug 2021 2:27 PM GMT
అతడు మనిషి కాదు.. మృగం..! వావి వరసలు లేకుండా ప్రవర్తించాడు. కుమార్తెపై తన కామ వాంఛను తీర్చుకున్నాడు. మైనర్ కూతుర్ని అత్యాచారం చేశాడు. ఈ కేసులో ఆ కామాంధుడికి అంబాలా స్థానిక కోర్టు పదేళ్ల జైలుశిక్షను విధించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్తి సింగ్ ఇవాళ ఈ తీర్పును వెలువరించారు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో తండ్రిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. జూలై 2018లోనే తండ్రిని సాహా పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను అంబాలా జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. తల్లి, అక్క, తమ్ముడితో ఉంటున్నానని ఓ రోజు నిద్ర పోతున్న సమయంలో తన తండ్రి వచ్చి లైంగికంగా దాడి చేశాడని ఆ మైనర్ అమ్మాయి తన ఫిర్యాదులో తెలిపింది.
ఒకవేళ ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే తల్లిని సోదరుడిని చంపేస్తానని తండ్రి బెదిరించాడు. పరిణామాలకు భయపడిన 17 ఏళ్ల ఆ అమ్మాయి జరిగిన విషయాన్ని అప్పట్లో ఎవరికీ చెప్పలేదు. ఎలాగోలా ధైర్యం కూడగట్టుకున్న ఆమె తండ్రి తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు సెషన్స్ జడ్జి ఆర్తి సింగ్ బుధవారం తీర్పును ప్రకటించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, అతని కుమార్తె ఫిర్యాదుపై 2018 లో పోక్సో చట్టం మరియు చట్టంలోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదైంది. సాహా పోలీసులు 2018 జూలైలో నిందితుడిని అరెస్టు చేశారు మరియు అప్పటి నుండి అతను అంబాలా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.