మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో.. ఓ జిమ్ ట్రైనర్ బాడీ మేకింగ్ పేరుతో ఓ వ్యక్తికి నిషేధిత ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో అతడికి ప్రైవేట్ పార్ట్‌లో సమస్యలు మొదలయ్యాయి. ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో జిమ్ ట్రైనర్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. ఇండోర్‌లోని ఎంఐజీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కండరాలు, స్టామినా పెంచడం కోసం ఓ జిమ్ ట్రైనర్ ఆ వ్యక్తికి నిషేధిత ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత వ్యక్తి ఆరోగ్యం క్షీణించి, అతని ప్రైవేట్ పార్ట్‌లో సమస్య ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో కాలిపోతున్నట్లు అనిపించడమే కాకుండా.. అతను తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జిమ్ ట్రైనర్ సోనూఖాన్, అతని సోదరుడు రయీస్‌ఖాన్‌లపై అజాజ్ అనే 20 ఏళ్ల యువకుడికి స్టామినా పెంచడం, కండలు పెంచుకోవడం కోసం నిషేధిత ఇంజెక్షన్ ఇచ్చారని కేసు పెట్టినట్లు ఎంఐజీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ వర్మ తెలిపారు. . నిందితులపై మెడికల్ కౌన్సిల్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఓ మహిళ సదరు జిమ్ ట్రైనర్‌పై కేసు పెట్టిందని ఓ అధికారి తెలిపారు. ట్రైనర్లు ఇంజెక్షన్ చేసిన తర్వాత తన శరీరంలో సమస్యలు మొదలయ్యాయని, దీంతో వాపు కూడా పెరిగిందని మహిళ ఆరోపించింది.