వందమందికి పైగా అమ్మాయిలను వేధించిన జిమ్ ట్రైనర్
Gym Trainer Arrested For Stalking Over 100 Women Online In Delhi. ఢిల్లీకి చెందిన ఓ జిమ్ ట్రైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat
ఢిల్లీకి చెందిన ఓ జిమ్ ట్రైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 మందికి పైగా మహిళలను అతడు ఆన్ లైన్ లో వేధించినట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో 100 మందికి పైగా మహిళలకు నకిలీ ఖాతాల నుండి అశ్లీల సందేశాలు, వీడియో క్లిప్పులను పంపిన 22 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ సైబర్ సెల్ బృందం ద్వారకాలో ఉన్న జిమ్‌లో శిక్షణ పొందిన వికాస్ కుమార్‌ను అరెస్టు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులను ప్రేరేపించడానికి నిందితుడు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల నుండి అశ్లీల సందేశాలు మరియు వీడియో క్లిప్‌లను పంపించేవాడు. ఇందుకోసం అతడు ఉపయోగించిన మొబైల్ మరియు సిమ్ కార్డు అతని నుండి స్వాధీనం చేసుకున్నారు. "సాగర్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదైంది, ఒక మహిళ తనకు ఫేస్బుక్ మెసెంజర్లో అసభ్యకరమైన సందేశాలు మరియు అశ్లీల వీడియోలను పంపుతున్నాడని.. తనను పదేపదే వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. నిందితుడు కూడా తనకు వ్యక్తిగతంగా తెలుసని ఆమె చెప్పుకొచ్చారు" అని పోలీసులు తెలిపారు. తనకు తెలిసిన మహిళలకే.. అతడు ఫేక్ అకౌంట్ల ద్వారా మెసేజీలు పంపిన్నట్లు కూడా తెలుస్తోంది. దర్యాప్తులో ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా సంస్థల నుండి సమాచారాన్ని సేకరించింది.
ప్రాథమిక విచారణలో ఫేక్ ఐడీలను రూపొందించడానికి ఉపయోగించిన వివరాలను తప్పుడు మార్గాల ద్వారా పొందాడని తెలుస్తోంది. వికాస్ కుమార్ (22) ఒక మహిళ వలె నటించి నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించడం ద్వారా బాలికలను / మహిళలను ప్రలోభపెట్టేవాడు. 100 మందికి పైగా మహిళలను వేధించడానికి ఫేక్ ఫేస్బుక్ ఐడిలను సృష్టించాడు. ఇప్పటివరకు.. మూడు ఫేస్బుక్ ఖాతాలను గుర్తించారు. వీటిని ఉపయోగించి అతను 2 వేల మందికి పైగా స్నేహం చేసాడని పోలీసులు తెలిపారు.