గ్వాలియర్ నగరంలో జరిగిన రెండు ఏటీఎం దోపిడీ ఘటనలకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి మొత్తం రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గ్వాలియర్‌లో రెండు ఏటీఎం దోపిడీ ఘటనలు జరిగాయి. నిందితుడి గురించి సమాచారం కోసం పోలీసులు వెతుకుతూ ఉండగా.. ఎట్టకేలకు యశ్వీర్ గుర్జార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ దొంగతనానికి సంబంధించి ప్రధాన కుట్రదారుని పట్టుకోవడంతో పాటు మరో ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గ్వాలియర్ ఎస్‌ఎస్‌పి అమిత్ సంఘీ మాట్లాడుతూ, “గ్వాలియర్‌లో రెండు ఎటిఎం కటింగ్ సంఘటనలు జరిగాయి. ఒకటి బహోదాపూర్‌లో.. మరొకటి మురార్ థానా ప్రాంతంలో. స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో దుండగులను గుర్తించారు. మేవాత్ ప్రాంతంలోని నుహ్ ప్రాంతంలో మా బృందం నిందితుల కోసం వెతుకుతూ ఉండగా.. ఒక నిందితుడిని అరెస్టు చేశారు, అతను ధోల్‌పూర్‌కు చెందినవాడు. అతని నుంచి ₹ 8 లక్షలు, ATM కటింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు." అని తెలిపారు. నిందితుడు ధోల్‌పూర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని.. రెండు ట్రక్కులు, ఒక కారు చోరీ ఘటనల్లో కూడా ఇతడు భాగస్వామ్యుడయ్యాడు. అతను రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు.