మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలని ఎవరు అన్నారో కానీ.. డబ్బుల కోసం, ఆస్థుల కోసం సొంతం వాళ్లనే కాదని అనుకుంటూ ఉన్నారు. ఆస్తుల కోసం.. డబ్బుల కోసం సొంత మనుషులనే కడతేర్చాలనే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అలాంటి ఓ దారుణం గురుగ్రామ్ పరిధిలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా 35 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్‌కు చెందిన క్రిషన్ చంద్ (70) మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్తి విషయంలో తీవ్ర విభేదాల కారణంగా నోని అనే వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు.
అధికారులు మాట్లాడుతూ తండ్రి మరియు కొడుకుల మధ్య ఆస్తి విషయంలో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయే ముందు ఆవేశంతో నోని తన తండ్రిని పదునైన పరికరంతో కొట్టాడు. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురుగ్రామ్‌లోని న్యూ కాలనీ పోలీస్ స్టేషన్‌లో, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడు మద్యం తాగి తరచూ తండ్రితో గొడవ పడుతుండడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.