గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలో గల బీచ్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. సెలవు రోజు కావడంతో బ్రిటన్‌కు చెందిన 7, 10 ఏళ్ల వయస్సు గల ఇద్దరు చిన్నారులు తమ తాతా, అమ్మమ్మలతో కలిసి సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు. సముద్రం ఒడ్డున ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు కాసేపు ఆటలాడుకున్నారు. ఇంతలోనే ఓ భారీ అల ఒక్కసారిగా వచ్చి ఆ చిన్నారులను సముద్రంలోకి లాగింది. ఇది గమనించిన తాతా వెంటనే వారిని రక్షించేందుకు సముద్రంలోకి వెళ్లాడు. చిన్నారులు అయితే క్షేమంగా బయటపడ్డారు కానీ.. తాత మాత్రం బయటపడలేక పోయాడు.
సముద్రంలో మునిగి ప్రాణాలు తాతా (61) కోల్పోయాడు. ఒక్కసారిగా అలలు పొటెత్తడంతో చిన్నారులు సముద్రం లోపలికి వెళ్లిపోయారు, దీంతో వారిని రక్షించేందుకు వెళ్లిన వృద్ధుడు చనిపోయాడని గ్రీస్ కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. '' మేం అతడిని ఒడ్డుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాము, కానీ అలల పోటెత్తడంతో కాపాడలేకపోయామని'' అధికారులు తెలిపారు. చివరికి ఆ వృద్ధుడి మృతదేహాన్ని వెలికితీసి, పడవలో ఎక్కించామని సహాయక చర్యకు వచ్చిన స్థానిక కార్మికుడు తెలిపాడు.