చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకన్నారు. దుబాయ్ నుండి వస్తున్న ప్రయాణీకుల వద్ద రూ. 4 కోట్లకు పైగా విలువ చేసే 8.17 కేజీల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని గృహోపకరణాల్లో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్లు. చెన్నై ఎయిర్‌పోర్ట్ లో దుబాయ్ నుండి తీసుకుని వచ్చిన రైస్ కుక్కర్, జూసర్, నెబ్యులైజర్ లో బంగారాన్ని అమర్చి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. కస్టమ్స్ అధికారుల స్కానింగ్ లో కేటుగాళ్ల అక్రమ బంగారం రవాణా బయట పడింది. ఈ మేరకు గృహోపకరణాలల్లో దాచిన 8 కేజీలకుపైగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.