మత్తులో బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు
Girlfriend got angry after taking drugs, cut boyfriend's private part while having a relationship. ఏ సంబంధంలోనైనా తగాదాలు సహజం, అయితే కొన్నిసార్లు ఈ గొడవలు చాలా పెద్దవి అవుతూ ఉంటాయి
By Medi Samrat Published on 4 March 2022 2:00 PM GMT
ఏ సంబంధంలోనైనా తగాదాలు సహజం, అయితే కొన్నిసార్లు ఈ గొడవలు చాలా పెద్దవి అవుతూ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక మత్తులో జోగాడుతూ ఉండే వాళ్లు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అసలు ఊహించలేము. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతం కూడా అలాంటిదే. ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై ముందుగా తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్ ను కోసి ఆపై తల నరికి చంపేసింది. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్‌లో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, అతని శరీర భాగాలు ఛిద్రమై ఉన్నాయని పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అవయవాలను సేకరించి విచారణ ప్రారంభించారు. పోలీసులు చనిపోయిన వ్యక్తి ప్రియురాలు సారాని కూడా విచారించారు, ఆ తర్వాత సారా విషయం మొత్తం చెప్పేసింది.. తన నేరాన్ని ఒప్పేసుకుంది.
ఆ రోజు రాత్రి ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నామని తెలిపింది. కొంత సమయం తరువాత ఇద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తురాలైన నిందితురాలు తన ప్రియుడి గొంతు కోసి చంపేసింది. అతడిని చంపడం తనకు ఇష్టం లేదని, అయితే ఆ తర్వాత అతడిని ముక్కలు చేసి నరికి చంపానని మహిళ చెప్పింది. మహిళ అతని ప్రైవేట్ భాగాన్ని కోసి బకెట్‌లో ఉంచి, ఆపై అతని తలను నరికి వేరే ప్రదేశంలో దాచింది. ఇలా ప్రియుడి శరీరంలోని అనేక భాగాలను వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టింది. మహిళ మానసిక పరిస్థితి కూడా బాగా లేదనే అంశం కూడా విచారణలో తెరపైకి వచ్చింది.