మూడేళ్ల కిందటే సూసైడ్ నోట్ రాసుకున్న యువతి

Girl wrote suicide note 3 years ago, now committed suicide. బీహార్‌లోని పాట్నాలో ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. పాటలీ పుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో

By Medi Samrat  Published on  8 May 2022 8:52 AM GMT
మూడేళ్ల కిందటే సూసైడ్ నోట్ రాసుకున్న యువతి

బీహార్‌లోని పాట్నాలో ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. పాటలీ పుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అద్దె ఇంట్లో నివసించేది. ఆమెతో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, ఇద్దరూ నాలుగేళ్లకు పైగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అయితే మూడేళ్ల క్రితం ఆ యువతి ఈ సూసైడ్ నోట్ రాసింది.

పాట్నాలోని నెహ్రూ నగర్ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి గదిలో యువతి ఉరి వేసుకుని కనిపించింది. తాన్యా శర్మ నెహ్రూ నగర్‌లోని మనోజ్‌కుమార్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. ఆమెతో పాటు నితీష్ కుమార్ అనే యువకుడు కూడా నివసిస్తూ ఉన్నాడు. వారిద్దరూ చాలా నెలలుగా ఇక్కడే ఉంటున్నారు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. తాన్య శర్మ కుటుంబం పాట్నాలోని గోలా రోడ్‌లో నివసిస్తోంది. కానీ తాన్య కుటుంబంతో కలిసి ఉండడం లేదు. పాటిల్‌పుత్ర పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు తాన్యతో నివసిస్తున్న నితీష్ కుమార్‌ను ప్రశ్నించగా, శుక్రవారం రాత్రి తాన్యాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. మందులు తీసుకుని రావడానికి ఆమె తనను పంపిందని నితీష్ తెలిపాడు.

మందులు తీసుకుని తిరిగి వచ్చేసరికి గది తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి చూడగా తాన్య మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తాన్య గదిలో సోదా చేయగా, అందులో 3 ఏళ్లనాటి సూసైడ్ నోట్ కనిపించింది, తన జీవితంలో ఇబ్బంది పడుతున్నానని, బతకడం ఇష్టం లేదని రాసి ఉంది. తాన్య గత నాలుగు సంవత్సరాలుగా తన కుటుంబంతో విడివిడిగా నివసించడమే కాకుండా.. పాట్నాలోని మౌర్య లోక్‌లోని ఒక చాక్లెట్ షాప్‌లో పనిచేసింది. పోలీసులు మరిన్ని విషయాలని తెలుసుకోడానికి తాన్యా మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తున్నారు.












Next Story