ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి.. పైగా ఇద్దరు ప్రాణ స్నేహితులు..!

Girl friend attack lovers fiancee. కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రియురాలు ప్రియునికి కాబోయే భార్యపై చాకుతో హత్యాయత్నం చేసింది.

By అంజి  Published on  8 Nov 2021 8:29 AM GMT
ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి.. పైగా ఇద్దరు ప్రాణ స్నేహితులు..!

కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రియురాలు ప్రియునికి కాబోయే భార్యపై చాకుతో హత్యాయత్నం చేసింది. ప్రియురాలు చేసిన దాడిలో బాధితురాలికి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శిడ్లఘట్ట తాలుకా ఆనేమడుగుకు చెందిన ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరి స్నేహం ఎలాంటిది అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత. అయితే వీరి స్నేహంలోకి గంగరాజు అనే యువకుడు వచ్చి చిచ్చు పెట్టాడు. గుట్టుగా ఇద్దరిని ప్రేమించాడు. గంగోత్రి (20), మోనిక (19)లను మాయ మాటలు చెప్పి ప్రేమ ముగ్గులోకి దించాడు. దీంతో ఇద్దరు యువతులు అతడిని నమ్మి ప్రేమ వ్యవహారం సాగించారు.

కొన్ని రోజుల కిందట మోనికకు యువకుడు గంగరాజుతో పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న గంగోత్రి కోపంతో రగిలిపోయింది. స్నేహితురాలిని చంపడానికి సిద్ధమైంది. తనను ప్రేమించి తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతిపై దాడికి పాల్పడింది. ఆదివారం రోజున మోనిక ఇంటికి వెళ్లిన గంగోత్రి ఆమెపై చాకుతో దాడి చేసింది. దీంతో మోనిక మెడకు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు గంగోత్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story
Share it