Girl allegedly gang-raped by seven minors in Jharkhand. జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని రాంచీ జిల్లాలో ఓ బాలికపై ఏడుగురు
By Medi Samrat Published on 30 Aug 2021 10:16 AM GMT
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని రాంచీ జిల్లాలో ఓ బాలికపై ఏడుగురు అబ్బాయిలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందార్ పోలీస్ స్టేషన్ పదిధిలో నివసిస్తున్న బాలికకు ఓ బాలుడు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే అతని ఆరుగురు స్నేహితులు ఉన్నారు. అబ్బాయిలను చూసిన ఆ అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నించింది.. కానీ బాలికపై వారంతా బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
జరిగిన ఘటనపై బాలిక తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. మరుసటి రోజు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసు అధికారి రాణా సింగ్ మాట్లాడుతూ.. నిందితులందరూ మందార్ ప్రాంతానికి చెందిన వారేనని.. వారిలో నలుగురిని శనివారం అరెస్టు చేశామని.. ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని.. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసినట్లు వెల్లడించారు. బాధిత బాలికను జువైనల్ హోమ్‌కు తరలించామని అధికారి తెలిపారు.