23 ఏళ్ల యువతి ఆత్మహత్య.. స్నేహితులే రూ. 30 లక్షల మోసం చేశారంటూ..!

ఘజియాబాద్‌లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మరణించింది.

By -  Medi Samrat
Published on : 16 Feb 2026 4:01 PM IST

23 ఏళ్ల యువతి ఆత్మహత్య.. స్నేహితులే రూ. 30 లక్షల మోసం చేశారంటూ..!

ఘజియాబాద్‌లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మరణించింది. ఆ మహిళను పవన్ వర్మ కుమార్తె కరిష్మాగా గుర్తించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించగా ఆ తర్వాత ప్రాణాలు వదిలిందని వైద్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి దర్యాప్తు ప్రారంభించారు.

కరిష్మా చిన్ననాటి స్నేహితురాలు శివంగి పలువురితో కలిసి కుట్ర పన్ని కరిష్మా బ్యాంకు ఖాతా నుండి దాదాపు రూ. 25-30 లక్షలు కాజేసుకున్నారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. నిందితులు ఆమెను ప్రలోభపెట్టి, ఆ డబ్బును వారి సొంత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కరిష్మా తన డబ్బును తిరిగి అడిగినప్పుడు, ఆమెను మానసికంగా వేధించారని, బ్లాక్‌మెయిల్ చేశారని కుటుంబం వాపోయింది. నిరంతర ఒత్తిడి కారణంగా ఈ తీవ్రమైన చర్య తీసుకుంది.

Next Story