ఇలా కూడా లొంగిపోతారా..?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ అంటే చాలు వణికిపోతున్నారు రౌడీలు.
By Medi Samrat Published on 18 Dec 2023 6:37 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ అంటే చాలు వణికిపోతున్నారు రౌడీలు. బయట ఉండడం కంటే జైలులో ఉండడమే బెటర్ అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది మమ్మల్ని చంపకండి!! ఎన్ కౌంటర్ చేయకండి!! అంటూ పోలీసుల ముందు లొంగిపోవడం మనం చూశాం. తాజాగా ఓ గ్యాంగ్ స్టర్ మెడలో ప్లకార్డు వేసుకుని వచ్చి మరీ లొంగిపోయాడు.
ఉత్తర్ప్రదేశ్ బదాయూ జిల్లాలోని సహస్వాన్ పోలీస్ స్టేషన్‌లో గోవధ కేసులో నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్స్టర్ మెడలో ప్లకార్డు ధరించి నేరుగా పోలీసు స్టేషన్కు చేరుకున్నాడు. ఆ ప్లకార్డుపై 'యోగి బాబా దయచేసి నన్ను రక్షించండి, ఇక నుంచి నేను గోహత్య చేయను' అంటూ రాసి ఉంది. ఖైర్‌పుర్ ఖైరతి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం గత కొంతకాలంగా గోహత్యకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అతడిపై గోవధ చట్టం కింద కేసు నమోదైంది. కేసు నమోదైందని తెలిసి ఆలం పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా కొన్ని రోజులు తప్పించుకుని తిరిగిన ఆలం మెడలో ప్లకార్డును ధరించి పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యాడు. గోవులను చంపినందుకు తాను లొంగిపోతానని.. ఇక నుంచి గోవధ చేయనని రాసిన ప్లకార్డుతో పోలీసుల ముందుకు వచ్చాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.