AK-47తో దొరికిపోయిన పింటూ..
Gangster caught with AK-47 in UP. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వెలుపల పోలీసులపై దాడి ఘటన గురించి
By Medi Samrat Published on 5 April 2022 10:50 AM GMTఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వెలుపల పోలీసులపై దాడి ఘటన గురించి ఓ వైపు చర్చించుకుంటూ ఉండగా.. షామ్లీ ప్రాంతంలో AK-47, 1300 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. షార్ప్‌షూటర్ సంజీవ్ జీవా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి, ముఖ్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల తర్వాత షామ్లీ పోలీసులు అరెస్టు చేశారు. సంజీవ్ జీవా గ్యాంగ్‌కు చెందిన అతడి వద్ద నుంచి ఏకే-47, 1300 కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మీరట్‌లోని అగ్రికల్చర్ యూనివర్శిటీ డీన్ హత్యలో నిందితుడిగా ముఠా సభ్యుడు ఉన్నాడు. ఏకే-47 ఆయుధం రికవరీ కేసులో.. ఆ ఆయుధం విదేశాల నుంచి వచ్చిందా లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఠానా భవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కదర్‌ఘర్ అవుట్‌పోస్ట్ వద్ద సోదాలు చేస్తున్నప్పుడు, హడోలి గ్రామానికి చెందిన అనిల్ అలియాస్ పింటూను AK-47తో పాటు అరెస్టు చేశారు. అతని సహచరులు ఇద్దరు తప్పించుకోగలిగారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. కారులో ఉన్న ముగ్గురు అగంతకులు ముజఫర్‌నగర్ నుంచి కదర్‌ఘర్ మీదుగా హర్యానా వెళ్తున్నారు. ఇన్‌ఫార్మర్ సమాచారం మేరకు ఎస్‌హెచ్‌ఓ ప్రేమవీర్ సింగ్ రాణా, కదర్‌ఘర్ అవుట్‌పోస్టు ఇన్‌చార్జి ఉపేంద్ర సింగ్, జలాలాబాద్ పోలీస్ ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జి విజయ్ త్యాగి, పోలీసు సిబ్బందితో కలిసి కదర్‌గఢ్ అవుట్‌పోస్టు వద్ద వల వేసి అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని ఇద్దరు సహచరులు పారిపోయారు. పోలీసులు ఏకే-47, 1300 మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు మీరట్‌లో రాజ్‌వీర్ సింగ్ డీన్‌పై దాడికి కూడా ఈ దుండగులు పాల్పడ్డారు.