ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి యువతిపై సామూహిక అత్యాచారం

Gang Raped together on the pretext of job. బీహార్‌లోని దానాపూర్‌లో ముగ్గురు ఆటో డ్రైవర్లు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన

By Medi Samrat
Published on : 18 April 2022 7:59 PM IST

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి యువతిపై సామూహిక అత్యాచారం

బీహార్‌లోని దానాపూర్‌లో ముగ్గురు ఆటో డ్రైవర్లు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఖగోల్‌లోని కొత్వా ప్రాంతంలో ఆటో డ్రైవర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. ముగ్గురు డ్రైవర్లు కూరగాయలు అమ్మే మహిళను మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడ కూరగాయలు ఎందుకు అమ్ముతున్నావు, నీకు ఏసీ ఆఫీసులో ఉద్యోగం దొరుకుతుందని పప్పూ అనే డ్రైవర్ చెప్పాడు. మహిళ అతని వలలో పడి అతనితో పాటు వెళ్ళింది. అనంతరం ముగ్గురు ఆటోడ్రైవర్లు ఆమెను ఎవరూ లేని ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మహిళ ఫిర్యాదు మేరకు ముగ్గురు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. టెంపో డ్రైవర్, మణిపుర నివాసి పప్పు కుమార్.. టెంపో డ్రైవర్ పవన్ కుమార్, సిమ్రా కోయిల్వార్ నివాసి. మూడో టెంపో డ్రైవర్ పేరు మనోజ్ కుమార్. అతను సికారియా పాలిగంజ్ నివాసి. పోలీసుల విచారణలో ఆటోడ్రైవర్లు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డామని ఒప్పుకున్నారు.

ఈ ఘటనపై ఖాగౌల్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ముఖేష్ కుమార్ మాట్లాడుతూ సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలిపారు. మహిళ ఫిర్యాదు చేయడంతో వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కూరగాయల వ్యాపారులందరిలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను ప్రజలకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు.













Next Story