కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తి తన 7 ఏళ్ల కుమార్తె, అత్త 50 ఏళ్ల మాసవతి, 26 ఏళ్ల మరదలిని హత్య చేసిన తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని హత్య చేసిన తర్వాత, ఆ వ్యక్తి తన ఇంటి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ప్రాణం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. వివాహం అనంతరం సమస్యల కారణంగా అతని భార్య రెండేళ్ల క్రితం మంగళూరుకు వెళ్లినప్పటి నుండి అతను మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. "చాలా కాలంగా ఉన్న కుటుంబ వివాదాలు, ఈ హత్యలు, ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చు" అని చిక్కమగళూరు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ అమతే అన్నారు.
మంగళవారం నాడు ఆ వ్యక్తి కూతురు పాఠశాల నుండి తిరిగి వచ్చింది. అమ్మ ఇంటికి ఎందుకు రాలేదని ఆమె అడిగింది. కోపంతో అతను రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన భార్య ఇంట్లోకి చొరబడి తన అత్త, మరదలు, కుమార్తెను కాల్చి చంపాడు. అతని మరదలి భర్త కూడా కాల్పుల్లో గాయపడ్డాడు. అయితే అతడు ప్రాణాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు, నిందితుడు తన భార్య విడిపోవడం పట్ల తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. ఈ విషయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.