పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా చుచురా పట్టణంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడే కాల్చి చంపాలని చూశాడు. బులెట్ గాయమైన ఆ స్నేహితుడు కొన్ని గంటల పాటూ చల్లటి నీళ్లలో దాక్కుని తప్పించుకున్నాడు. ఎలాగోలా రాత్రంతా నీళ్లల్లో గడిపిన అతడు.. కొన్ని గంటల పాటూ నీళ్ళల్లోనే ఉన్నాడు. కార్తీక పూజా నిమజ్జనం తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడు గంగా ఘాట్ దగ్గరకు వ్యక్తిని తీసుకెళ్లి పైప్ గన్‌తో వీపుపై కాల్చాడు. స్నేహితుడి కాల్పుల్లో గాయపడిన దీప్ మండల్ (20) ప్రాణాలు కాపాడుకునేందుకు గంగా నీటిలో దూకాడు. దీప్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి రాత్రంతా గంగా నదిలోని చల్లని నీటిలో దాక్కున్నాడు. ఉదయం బైక్‌పై ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు.
కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం చుచురాలోని ఇమాంబర సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడి నుండి వైద్యులు అతన్ని కోల్‌కతాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీయలేకపోయారని చెబుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దీప్ మండల్ స్నేహితుడు 21 ఏళ్ల రాజా బిస్వాస్ తప్పించుకోడానికి ప్రయత్నించగా.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజా బిశ్వాస్‌పై చూచురా పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇద్దరూ చుచురాలోని రవీంద్రనగర్ ప్రాంతానికి చెందినవారు. బాధితుడు తమలపాకుల వ్యాపారి అని తెలుస్తోంది.