పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కుటుంబం

Four of family attempts suicide by consuming pesticide in Vijayawada. విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన

By Medi Samrat  Published on  25 April 2022 8:45 AM GMT
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కుటుంబం

విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పురుగుల‌మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డిన‌ దారుణ ఘటన చోటుచేసుకుంది. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కృష్ణలంక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితులకు ఉప్పునీరు అందించి రక్షించారు. బాధితులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది.

అందిన సమాచారం ప్రకారం.. ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డిన‌ వారిని మచిలీపట్నంకు చెందిన‌ జూపూడి వెంకటేశ్వరరావు, అతని భార్య రాధారాణి, కుమార్తెలు భావన, శ్రావణిగా గుర్తించారు. వీరు గత నెలలో విజయవాడ వచ్చి బస్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఉంటున్నట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నలుగురు ప్రాణాలకు తెగించి ఉంటారని అనుమానిస్తున్నారు.

పురుగుల మందు తాగే ముందు కుటుంబసభ్యులు తమ బంధువుల్లో ఒకరికి ఫోన్‌లో సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పార‌ని.. వారు విజయవాడలో ఉన్నారని తెలియదని బంధువులు తెలిపారు.

Next Story
Share it