ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నలుగురు శిశువులు మరణించారు. అంబికాపూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. శిశువుల ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉండడంతో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్‌లో ఉంచారు. వాళ్లలో ఇద్దరికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే 4 గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో నలుగురు చిన్నారులు చనిపోయారని జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్ తెలిపారు.
అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఆ పిల్లలు చనిపోయారనే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దాచేయడానికి ప్రయత్నించారు.. ఎప్పుడైతే పిల్లల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారో.. అప్పుడు అసలు విషయం చెప్పారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో తెలిపారు.