Nellore : రోడ్డు ప్రమాదంలో న‌లుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో నలుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

By -  Medi Samrat
Published on : 5 Jun 2025 7:59 AM IST

Nellore : రోడ్డు ప్రమాదంలో న‌లుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో నలుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఆత్మకూరు మండలం ఏఎస్ పేట అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. మృతుల‌ను వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న పొగాకు కూలీలు గా గుర్తించారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు.

Next Story