హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Four Killed In Road Accident At Hanamkonda District. హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్ ప్రధాన రహదారిపై కారు, టిప్ప‌ర్ ఢీ కొన‌డంతో

By Medi Samrat
Published on : 25 Jun 2023 8:21 PM IST

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్ ప్రధాన రహదారిపై కారు, టిప్ప‌ర్ ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్ర‌మాదంలో కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులోనే ఉన్న‌వారు అందులోనే ప్రాణాలు విడిచినట్లు స్తానికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతుల‌ది గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాశీబుగ్గ. మృతిచెందిన వారిని అనుముల నరసింహ చారి, వెల్డండి సాంబరాజు, వెల్డెండి ఆకాంక్ష, వెల్దండి లక్ష్మి ప్రసన్నగా గుర్తించారు. గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ చికిత్స పొందుతున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story