కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Four killed in blast in chemical factory in UP. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన భారీ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు

By Medi Samrat  Published on  31 March 2023 11:00 AM GMT
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Four killed in blast in chemical factory in UP


ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన భారీ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి రసాయనాల తయారీ ఫ్యాక్టరీలో మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం చాలా కిలోమీటర్ల వరకు వినిపించిన‌ట్లు చెబుతున్నారు. పేలుడు తీవ్ర‌త‌కు చుట్టుపక్కల ఇళ్ల కిటికీలు, తలుపులు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. దీంతో మృతదేహాలను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.Next Story