వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం

Four killed after car rams into home in karimnagar. కరీంనగర్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని కమాన్‌ చౌరస్తా దగ్గరు కారు బీభత్సం సృష్టించింది.

By అంజి
Published on : 30 Jan 2022 8:39 AM IST

వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం

కరీంనగర్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని కమాన్‌ చౌరస్తా దగ్గరు కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డుపక్కనే ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో ఉన్న నలుగురు వీధి వ్యాపారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఫరియాద్‌, లలిత, జ్యోతి, సునీతగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే వికారాబాద్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. బైక్‌ను లారీ ఢీకొట్టింది. పరిగి మండలంలోని తొండపల్లి శివారులో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story