మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పల్సర్ బైక్‌పై వెళ్తున్న కుటుంబ సభ్యులరు గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. రేపు సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉన్నందున ఓ కుటుంబం ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి కామారెడ్డికి బయలుదేరింది. ఈ క్రమంలో పెద్దశంకరంపేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.