బెంగళూరులో గ్యాంగ్ రేప్ కలకలం

Four booked for gangrape of woman in Bangalore. పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు వ్యక్తులను

By Medi Samrat  Published on  30 March 2022 9:32 AM GMT
బెంగళూరులో గ్యాంగ్ రేప్ కలకలం

పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు వ్యక్తులను మంగళవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులను రజత్, శివరన్, దేవ్ సరాయ్, యోగేష్ కుమార్ లుగా గుర్తించారు. నిందితులంతా న్యూఢిల్లీకి చెందిన వారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు బెంగళూరులోని సంజయ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డిసిపి (నార్త్) వినాయక్ పాటిల్ మాట్లాడుతూ.. బాధితురాలు ప్రైవేట్ కంపెనీకి చెందిన యువతి. గత వారం ఈ సంఘటన గురించి ఫిర్యాదు నమోదైంది.

డేటింగ్ యాప్‌లో నిందితుల్లో ఒకరైన రజత్‌తో మహిళకు పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు. సంఘటన జరిగినప్పుడు, ఆమె అతని ఇంటికి డిన్నర్ వెళ్ళింది. ఆ తర్వాత రజత్, అతని ముగ్గురు స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది యువతి. పోలీసులు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెంగళూరులో గ్యాంగ్ రేప్ కలకలంతో ఒక్క సారిగా అధికారులు షాక్ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Next Story
Share it