బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Five people were killed in an explosion at a firecracker factory in Madurai. తమిళనాడులోని మధురైలోని ఓ క్రాకర్స్ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.

By M.S.R
Published on : 10 Nov 2022 4:08 PM IST

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తమిళనాడులోని మధురైలోని ఓ క్రాకర్స్ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మదురైలోని తిరుమంగళంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగు జైలు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ బాణసంచా తయారీ కర్మాగారంలో కార్మికులు రోజూవారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో 15 మందికి పైగా కార్మికులు అక్కడ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి భవనం కుప్పకూలింది. 10 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న మధురై, తిరుమంగళం ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.


Next Story