ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున వేగంగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు సీజవ దహనమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యమునా ఎక్స్‌ప్రెస్ వేపై రాంగ్ రూట్‌లో వస్తున్న ఓ కంటెయినర్ ట్రక్క్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు కారును చుట్టుముట్టాయి. దీంతో అందులోని వారు సజీవ దహనమయ్యారు. కారులో ఉన్న వాళ్లు సహాయం కోసం అరిచారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ నాగాలాండ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. కారు లక్నో నుంచి డిల్లీకి వెలుతోంది.