విషాదం.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి

Five of a family die in suicide in Kolar. పోలీసులు సంబంధం లేని కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని బెదిరించడంతో ఓ కుటుంబం పురుగుల మందు తాగి

By అంజి  Published on  9 Nov 2021 3:12 AM GMT
విషాదం.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి

పోలీసులు సంబంధం లేని కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని బెదిరించడంతో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుటుంబ సభ్యులు ఐదుగురు కన్నుమూశారు. వివరాల్లోకి వెళ్తే.. కోలారు నగరంలోని గల్‌పేట పరిధిలోని కారంజికట్టలో పుష్ప అనే మహిళ తన కుటుంబంతో నివాసం ఉంటోంది. గత నెల 18వ తేదీన హెన్నేహళ్లి గ్రామానికి చెందిన ఓ సత్య, సుమిత అనే దంపతుల శిశువును మహిళా ఎత్తుకెళ్లింది. శిశువును ఎత్తుకెళ్లిన వారిలో పుష్ప కూడా నిందితురాలని స్థానిక మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గీతా, పుష్పలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పుష్ప పోలీసులకు తెలిపింది. అయినా కూడా నేరం ఒప్పుకోవాలని లేదంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పుష్పను పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో పుష్ప, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుటుంబం పరువు పొతుందన్న బాధతో ఆదివారం నాడు ఐదుగురు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని జిల్లా ఆస్పత్రికి అక్కడి నుండి ఆర్‌ఎల్‌ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మునియప్ప (75), భార్య నారాయణమ్మ(70), కుమారుడు బాబు (45), మనవరాలు గంగోత్రి (17) లు సోమవారం వేకువన చనిపోయారు. కుమార్తె పుష్ప రాత్రికి మరణించింది.

Next Story
Share it