బ్యూటీపార్లర్‌లో మహిళ ముందే.. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు అత్యాచారం..!

Five men raped a 17-year-old girl in tamilnadu. తమిళనాడులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో నిందితులకు ఓ మహిళ సహకరించడం కలకలం రేపుతోంది.

By అంజి  Published on  20 Nov 2021 7:37 AM GMT
బ్యూటీపార్లర్‌లో మహిళ ముందే.. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు అత్యాచారం..!

తమిళనాడులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో నిందితులకు ఓ మహిళ సహకరించడం కలకలం రేపుతోంది. శివగంగ జిల్లా కరైకుడిలో ఈ అమానుష ఘటన జరిగింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరైకుడికి చెందిన 17 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతోంది. రోజు తాను చదువుతున్న ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూల్‌కి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలోనే 2 నెలల కిందట తన స్నేహితురాలి బర్త్‌డే రోజు కావడంతో వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో బ్యూటీపార్లర్‌లో పని చేసే స్నేహితురాలితో తల్లితో పరిచయం ఏర్పడింది. దీంతో బాలిక తరచూగా బ్యూటీపార్లర్‌కు వెళ్లేది. ఆ బ్యూటీ పార్లర్‌ ఓనర్‌ పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంజిల్‌ ఛెత్రీది. అందులో హరీష్‌, చిరంజీవి, విఘ్నేష్‌ అనే ముగ్గురు యువకులు పని చేస్తుండగా.. బాలిక స్నేహితురాలి తల్లి మేనేజర్‌గా పని చేస్తోంది.

బాలిక రోజు బ్యూటీ పార్లర్‌కు వస్తుండటంతో.. మంజిల్‌ ఆమెపై కన్నేశాడు. బాలికతో తనకు పరిచయం పెరిగేలా చూడాలని బాలిక స్నేహితురాలిని అడిగాడు. యజమాని దగ్గర మంచిగా అనిపించుకోవడం కోసం మహిళ.. ఆ బాలికను మంజిల్‌కు పరిచయం చేసింది. దీంతో మంజిల్‌ బాలికను సినిమాలకు, షికార్ల తీసుకెళ్తూ.. సమయం దొరికినప్పుడల్లా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బ్యూటీపార్లర్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులు సైతం బాలిక స్నేహితురాలి తల్లి ముందే.. బాలికపై అత్యాచారం చేశారు. మరో వ్యక్తి కూడా బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బాలిక స్కూల్‌కు రావడం లేదని తండ్రికి స్కూల్‌ టీచర్‌ ఫోన్‌ చేసింది. దీంతో తండ్రి బాలికను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. వెంటనే బాలిక, తన తండ్రితో కలిసి కరైకుడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక స్నేహితురాలి తల్లితో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story
Share it