విషాదం : చుట్టుపక్కల వాళ్ల వేధింపులు.. కుటుంబమంతా విషం తాగి..
Five members of a family fed up with harassment, ate poison. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి
By Medi Samrat Published on
26 Nov 2021 9:39 AM GMT

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విషం తాగారు. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా, ఆమె తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ కేసులో ఇరుగుపొరుగు వారితో కలహాల కారణంగా కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతూ సూసైడ్ నోట్ లభించింది. సంజీవ్ జోషి మరియు అతని కుటుంబం ఆనంద్‌నగర్‌లోని అశోక్ విహార్‌లో నివసిస్తున్నారు. విషం తీసుకున్న తర్వాత అతని కుటుంబ సభ్యులను గురువారం రాత్రి గాయత్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వారిలో బాలిక పూర్వి జోషి మరణించింది. మృతురాలి తండ్రి సంజీవ్‌తో పాటు పూర్వి సోదరి, తల్లి అర్చన, అమ్మమ్మ నందిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషం సేవించినందుకు ఐదుగురు వ్యక్తులు రాత్రి ఆసుపత్రిలో చేరారని కేసు దర్యాప్తు చేస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖేష్ శ్రీవాస్తవ తెలిపారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచారు. చుట్టుపక్కల ఉన్న కొందరు వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Next Story