కూలి బతుకుల్లో ఇంతటి విషాదమా..!

ఇంటి నిర్మాణ స్థలంలో ఉంచిన తాత్కాలిక షెడ్‌పై టిప్పర్ లారీ ఇసుకను అన్ లోడ్ చేయడంతో ఐదుగురు కూలీలు మరణించారు.

By Medi Samrat  Published on  22 Feb 2025 9:08 PM IST
కూలి బతుకుల్లో ఇంతటి విషాదమా..!

ఇంటి నిర్మాణ స్థలంలో ఉంచిన తాత్కాలిక షెడ్‌పై టిప్పర్ లారీ ఇసుకను అన్ లోడ్ చేయడంతో ఐదుగురు కూలీలు మరణించారు. వారిలో ఒక మైనర్ కూడా ఉన్నారు. జఫ్రాబాద్ తహసీల్‌లోని పసోడి-చందోల్ వద్ద ఈ సంఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది.

పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, కూలీలు సైట్‌లో తాత్కాలిక షెడ్‌లో నిద్రిస్తుండగా, ఇసుకతో కూడిన టిప్పర్ వచ్చింది. అక్కడ కూలీలు నిద్రపోతున్నారని గుర్తించని ట్రక్ డ్రైవర్ చేసిన పొరపాటు ఐదుగురి ప్రాణాలు తీసింది.

నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్‌ ఇసుకను అన్‌లోడ్‌ చేశాడు. శిథిలాల నుంచి మహిళ, బాలికను రక్షించారు. ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్‌ పరారీలో ఉండగా, అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story