షాకింగ్‌.. ఇంట్లో ఐదు మృత‌దేహాలు.. వాటిపై బుల్లెట్ గుర్తులు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సహరాన్‌పూర్ ప్రాంతం సర్సావాలోని కౌశిక్ విహార్ కాలనీలో మంగళవారం ఉదయం త‌లుపులు మూసి ఉన్న ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

By -  Medi Samrat
Published on : 20 Jan 2026 10:56 AM IST

షాకింగ్‌.. ఇంట్లో ఐదు మృత‌దేహాలు.. వాటిపై బుల్లెట్ గుర్తులు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సహరాన్‌పూర్ ప్రాంతం సర్సావాలోని కౌశిక్ విహార్ కాలనీలో మంగళవారం ఉదయం త‌లుపులు మూసి ఉన్న ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్పీ దేహత్ పోలీసు బృందంతో వచ్చి పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ఈ కేసును ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు. పోలీసులు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాల‌పై బుల్లెట్ గుర్తులున్నాయి. మృతుల్లో వృద్ధురాలు, భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మృతుల్లో సంగ్రహన్ అమీన్ అశోక్ (40), అతని తల్లి విద్యావతి (70), భార్య అంజిత (35), ఇద్దరు కుమారులు కార్తీక్ (16), దేవ్ (13) ఉన్నారు. అశోక్ అతని గుండైపై కాల్చుకోగా.. అతని తల్లి, భార్య, ఇద్దరు కుమారుల నుదిటిపై కాల్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌ నకుద్‌ తహసీల్‌లో కలెక్షన్‌ అమీన్‌ పోస్టులో పనిచేస్తూ కుటుంబంతో సహా సర్సావాలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఘటనా స్థలం నుంచి పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ విచారణ తర్వాతే పరిస్థితి తేలనుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

Next Story