మొదట పిల్లలను బావిలోకి విసిరేసి.. ఆ తర్వాత తను కూడా..
First threw the children in the well and then jumped himself and gave his life. ఆదివారం మధ్యాహ్నం పాట్నాలోని బిక్రం ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది
By Medi Samrat Published on 22 Nov 2021 2:08 PM GMT
ఆదివారం మధ్యాహ్నం పాట్నాలోని బిక్రం ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు బిక్రం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుండి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ బావిలో దూకిన దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా కనిపించాయి. మహిళ మొదట చిన్న కుమారుడిని బావిలో పడేసి, పెద్ద కొడుకును బావిలో పడేసిన తర్వాత తానూ దూకింది.
విషయం తెలియగానే గ్రామానికి చెందిన వందలాది మంది బావి దగ్గర గుమిగూడారు. మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రజలు ప్రయత్నించారు. ఆదివారం మధ్యాహ్నం అస్పూర్ ధర్మకంటె సమీపంలోని బావి వద్దకు 27 ఏళ్ల యువతి చేరుకుందని గ్రామస్తులు తెలిపారు. ఆమెతో పాటు సుమారు ఒకటిన్నర సంవత్సరాలు, మూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. తన చేతులతో పిల్లలను తోసి వేసి ఆమె ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు కూడా కేసును ధృవీకరించారు. ఆస్పూర్ గ్రామ సమీపంలోని బావిలో మహిళ తన ఇద్దరు పిల్లలతో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు.