ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ, నేరాలు-ఘోరాలులో కూడా చూడ‌నన్ని ట్విస్టులు

First love marriage then got suicide note written. హర్యానాలోని పానిపట్‌లోని ది న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన యువతికి

By Medi Samrat  Published on  10 Dec 2021 11:56 AM GMT
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ, నేరాలు-ఘోరాలులో కూడా చూడ‌నన్ని ట్విస్టులు

హర్యానాలోని పానిపట్‌లోని ది న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన యువతికి నగరంలోని వికాస్ నగర్‌కు చెందిన నీరజ్‌తో ప్రేమ వివాహం జరిగింది. అది అతనికి రెండో పెళ్లి. ఈ కులాంతర వివాహానికి నీరజ్ కుటుంబం అంగీకరించకపోవడంతో భార్యాభర్తలిద్దరూ వేరుగా జీవిస్తున్నారు. కొంతకాలంగా అంతా బాగానే ఉందని, అయితే ఆ తర్వాత బాధితురాలి భర్త కుటుంబసభ్యులతో కలిసి ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆ యువతిపై వేధింపులు నిరంతరం కొనసాగుతూ వచ్చినా.. ఆమె దానిని సహిస్తూనే వచ్చింది.

ఓ రోజు తన భర్త తనకు నీళ్లలో మత్తు మందు కలిపి తాగించి, బలవంతంగా సూసైడ్ నోట్ రాయించుకోవడం కూడా జరిగిందని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత భర్త ఆమెకు ఉరి వేసి పారిపోయాడు. నా కూతురు అది చూసి మామ, అమ్మమ్మలకు సమాచారం అందించిందని బాధితురాలు తెలిపింది. సరైన సమయంలో ఆమెను కాపాడడంతో ప్రాణాలు నిలబడ్డాయి.ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు ఆస్పత్రిలో ఆమె జీవన్మరణ పోరాటం చేసింది. ఆమె ప్రాణాలు కాపాడినప్పటికీ.. ప్రస్తుతం ఆమె నడవడానికి వీలు లేని పరిస్థితి. మంచం నుండి లేవడానికి కూడా అవ్వడంలేదు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 307, 328 కింద కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించినట్లు చాందినీ బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ మంజిత్‌ సింగ్‌ తెలిపారు. మమతకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గౌరవ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడినప్పటికీ.. ఆమె లేచి నిలబడలేకపోతోందని వైద్యులు తెలిపారు.


Next Story
Share it