చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం

Firing In Chittoor District. చిత్తూరు జిల్లా యాదమరిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సురేశ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు

By Medi Samrat
Published on : 17 April 2023 8:15 PM IST

చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం

చిత్తూరు జిల్లా యాదమరిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సురేశ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. కాల్పులు అనంతరం అక్కడ నుంచి దుండగులు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సురేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో ఓ ఆస్పత్రిలో సురేశ్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అరాజేంద్ర, మనోహర్, గణేష్, నాగభూషణంలు కాల్పులు జరిపారని సురేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బాధితుడు సురేశ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మా కుటుంబ సభ్యులే ఈ దాడికి తెగబడ్డారని సురేశ్ ఆరోపిస్తూ ఉన్నాడు.


Next Story