ఫైనాన్షియర్ దారుణ హత్య
Financier hacked to death at office by 3 men. తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలంకన్ని పట్టణానికి చెందిన టీవీఆర్ మనోహర్
By Medi Samrat
తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలంకన్ని పట్టణానికి చెందిన టీవీఆర్ మనోహర్ అనే ఫైనాన్షియర్‌ను ముగ్గురు గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఆగస్టు 17 బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో అతడు తన కార్యాలయంలోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆయన కార్యాలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీటీవీ విజువల్స్‌లో, బాధితుడు మనోహర్ తన కార్యాలయంలో కుర్చీపై కూర్చుని నగదు లెక్కిస్తున్నట్లు చూడవచ్చు. అకస్మాత్తుగా, గుర్తు తెలియని దుండగులు కార్యాలయంలోకి చొరబడి మనోహర్‌ను కొడవళ్లతో నరికి చంపడానికి ప్రయత్నించారు. మొదట దాడిని తప్పించుకోగలిగిన మనోహర్.. చివరికి ముగ్గురు వ్యక్తులు అతని కార్యాలయంలోనే దారుణంగా నరికి చంపారు. ముగ్గురు వ్యక్తులు కార్యాలయంలో మనోహర్ ను నరికి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో మరో వ్యక్తి మణివేల్ కూడా ఉన్నాడు. మనోహర్‌పై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మణివేల్ అనే వ్యక్తిపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన మణివేల్‌ను నాగై ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేర్చారు.
టీవీఆర్ మనోహర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు నాగపట్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్య చేసిన సమయంలో నిందితులు ముగ్గురూ ముఖానికి మాస్క్‌లు కప్పుకున్నారు. తదుపరి విచారణ కోసం పోలీసు అధికారులు మనోహర్ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీని, నేరస్థలం సమీపంలోని ఇతర కెమెరా ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.