లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న కూతురు.. కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన తండ్రి

Father who set the house on fire that the daughter was married for love. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కోపం పెంచుకున్న తండ్రి దారుణానికి తెగబడ్డాడు. కూతురు ఇంట్లో ఉన్న సమయంలో

By అంజి  Published on  18 Oct 2021 12:55 PM GMT
లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న కూతురు.. కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన తండ్రి

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కోపం పెంచుకున్న తండ్రి దారుణానికి తెగబడ్డాడు. కూతురు ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి నిప్పు పెట్టాడు తండ్రి. ఈ ఘోరమైన ఘటన పక్క దేశం పాకిస్తాన్‌లోని ముజఫర్‌ఘర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఫజియా బీబీ అనే యువతి 18 నెలల కిందట మెహబూబ్ అహ్మద్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం తండ్రి మంజూర్‌ హుస్సేన్‌కు ఇష్టం లేదు. దీంతో తన కూతురిపై హుస్సేన్‌ కక్ష పెంచుకున్నాడు. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి నిప్పు పెట్టాడు. అదే సమయంలో ఇంట్లో యువతి సోదరి, సోదరి భర్త, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఉన్న వారందరూ ఆగ్నికి ఆహుతయ్యారు. ఇటీవల ఫజియా బీబీ తన సోదరి ఖుర్షీద్‌ మాయ్‌ని కలవడానికి ఇంటికి వెళ్లింది.

విషయం తెలుసుకున్న తండ్రి హుస్సేన్‌ తన కుమార్తెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఫజియా, అక్క ఖుర్షీద్‌ మాయ్‌, ఖుర్షీద్‌ భర్త, పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని, ఉదయం పని నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో మంటలు చెలరేగి ఉన్నాయని బీబీ భర్త మెహబూబ్‌ అహ్మద్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో రెండేళ్ల వయసు ఒకరు, ఇంకొకరు ఆరు, మరొకరు 13 సంవత్సరాల వయసు గల ఖుర్షీద్‌ మాయి పిల్లలతో పాటు తన 4 నెల కుమారుడు మరణించాడని అహ్మద్‌ చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story
Share it