దారుణం : ప‌ట్ట‌ప‌గ‌లు మార్కెట్‌లో మ‌ర‌ద‌లి కుటుంబంపై గొడ్డ‌లితో విరుచుకుప‌డ్డ తండ్రికొడుకులు

Father-son kill woman kin. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జ‌రిగింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో

By Medi Samrat  Published on  10 Dec 2021 7:11 AM GMT
దారుణం : ప‌ట్ట‌ప‌గ‌లు మార్కెట్‌లో మ‌ర‌ద‌లి కుటుంబంపై గొడ్డ‌లితో విరుచుకుప‌డ్డ తండ్రికొడుకులు

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జ‌రిగింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి మ‌ర‌ద‌లిని చంపి, ఆమె ఇద్దరు కుమారులను దారుణంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోని భోటీలో ఈ ఘటన జరగ్గా.. నిందితులు రాజు భార్గవ(48), అతని కుమారుడు రాధాశరణ్ (20) పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

ఘ‌ట‌న‌పై బోటీ ఏరియా పోలీస్‌ స్టేషన్‌ అధికారి సంజయ్‌ మిశ్రా మాట్లాడుతూ.. రాజు భార్గవ తన కొడుకు రాధాశరణ్‌తో కలిసి తన సోదరుడి భార్య మంజులతతో పాటు ఆమె కుమారులు వినయ్, గిర్రాజ్‌లపై గొడ్డలితో దాడి చేశారు. వీరిద్దరూ మొదట వినయ్‌పై దాడి చేయ‌గా.. మంజులత వారిని రక్షించడానికి వచ్చింది. దుర‌దృష్ట‌వాశాత్తు ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దాడిలో గాయ‌ప‌డ్డ‌ గిర్‌రాజ్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు భార్గవ.. మంజులత ఇంటి దగ్గర కాంక్రీట్ బెంచ్ అమర్చాడు. దానిని మంజులత కొడుకు వినయ్ వ్యతిరేకించాడు. ఈ విధంగా మొద‌లైన గొడ‌వ‌ హత్యతో ముగిసింది. ఈ దాడిలో వినయ్ స్వ‌ల్ప‌ గాయాలతో త‌ప్పించుకోగా.. మంజులత చనిపోయింది. తన తల్లికి సహాయం చేయడానికి ఇంటి నుండి బయటకు వచ్చిన గిర్‌రాజ్‌పై కూడా దాడి జరిగింది. అత‌ని వెన్నెముక , తలపై తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.


Next Story
Share it