కర్ణాటక రాష్ట్రం మైసూరులో వివాహితను ప్రైవేట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసినందుకు తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాధిత మహిళ మైసూరు నగరంలోని హెబ్బాల్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులైన తండ్రీకొడుకుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ కేసులో హెబ్బాల్ వాసులు గోవిందరాజు, ఆయన కుమారుడు ప్రమోద్‌లను అనుమానితులుగా చేర్చారు. బాధితురాలు వారి ఇంటికి అతి సమీపంలోనే ఉంటోందని పోలీసులు తెలిపారు.
బాధితురాలి భర్త పనికి వెళ్లినప్పుడు మహిళ స్నానం చేస్తుండగా వారు తమ మొబైల్‌లో వీడియో తీశారు. నిందితులు డబ్బు కోసం బాధితురాలిని రెండేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వారు ఆమెను లైంగికంగా కూడా వేధించారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని, భర్తకు పంపిస్తామని బాధితురాలిని బెదిరించారు. తండ్రీకొడుకుల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లతో విసిగిపోయిన బాధితురాలు వారిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫిర్యాదు చేయగా పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.