నిద్రపోతుండగా 11 ఏళ్ల కూతురిపై.. కన్నతండ్రి అత్యాచారయత్నం

Father molested daughter in AP's kadapa. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా

By అంజి  Published on  30 Jan 2022 9:30 AM GMT
నిద్రపోతుండగా 11 ఏళ్ల కూతురిపై.. కన్నతండ్రి అత్యాచారయత్నం

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. చిన్న, పెద్ద, అనే తేడా లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లాలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి.. తన సొంత కూతురిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన ఖాజీపేట పట్టణ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజీపేటకు చెందిన శివప్రసాద్‌కు భార్య, 11 ఏళ్ల కుమార్తె ఉంది.

అయితే కొన్ని రోజులుగా తండ్రి తన కన్న కూతురిపై తండ్రి కన్నేశాడు. అదును చూసి లోబర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి నిద్రపోతుండగా తన కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేసింది. ఇది విన్న తల్లి అక్కడి చేరుకుని భర్తను అడ్డుకుని.. కుమార్తెను అక్కును చేర్చుకుంది. కూతురి ద్వారా విషయం తెలుసుకుని పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను విచారించిన పోలీసులు.. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it